కుటుంబ సభ్యుల్లా చెట్లను కాపాడుకుందాం :మంత్రి సవిత

కుటుంబ సభ్యుల్లా చెట్లను కాపాడుకుందాం :మంత్రి సవిత

పెనుకొండ,న్యూస్ వెలుగు : మనిషికి ప్రాణాధారమైన చెట్లను కుటుంబ సభ్యుల మాదిరిగా కాపాడుకుందామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత పిలుపునిచ్చారు.  శుక్రవారం పెనుకొండలోని పూలేకులమ్మ గుడి సమీపంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రమంతటా కోటిన్నర మొక్కలు నాటాలని తమ ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సత్యసాయి జిల్లాలో 25 లక్షల మొక్కలను నాటి నున్నట్లు వెల్లడించారు. పచ్చని చెట్ల వల్లే మనిషికీ ప్రాణాధారమైన ఆక్సిజన్ లభిస్తోందన్నారు. చెట్లను కుటుంబ సభ్యుల మాదిరిగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమం అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందన్నారు. అందరూ మంత్రులూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం కోరారన్నారు. గత చంద్రబాబునాయుడు ప్రభుత్వాల హయాంలోనూ పెద్ద ఎత్తున్న మొక్కలు నాటిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

ప్రతి పుట్టిన రోజునా తన కుమారుడితో మొక్క నాటిస్తున్నా..

తన కుమారుడి రోజున ప్రతి ఏటా మొక్క పాటిస్తున్నాయి మంత్రి సవిత వెల్లడించారు. ఇలా 11 ఏళ్ల నుంచి మొక్కలు నాటిస్తున్నామని, నాటడంతోనే‌ సరిపెట్టకుండా వాటిని సంరక్షిస్తున్నామని తెలిపారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో జరిగే శుభ కార్యాల సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. భవితరాల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్నారు.
ఇలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితే పర్యావరణానికి మేలు జరుగుతుందని, తద్వారా అందరికీ ఆక్సిజన్ అందుతుందని తెలిపారు.ఇప్పటికే ఆశించిన మేర చెట్లు లేకపోవడం, మరికొందరు అక్రమార్కులు ఇష్టారాజ్యంగా చెట్లు నరకడం వల్ల పర్యావరణం దెబ్బతిని వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయని, భూ గర్భ జలాలు ఇంకిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

చెట్లు నరికించిన జగన్

గడిచిన అయిదేళ్లలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్లే…పర్యావరణనాన్ని కూడా జగన్ నాశనం చేశారని మంత్రి మండిపడ్డారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కూడా పరదాల మాటున పర్యటిస్తూ, చెట్లను విపరీతంగా నరికించారన్నారు. అందుకు భిన్నంగా తమ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మొక్కలు నాటే ఉద్యమంలా చేపడుతుంటారన్నారు. ఇపుడు కూడా అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జిల్లా అటవీశాఖాధికారులు, టీడీపీ నాయకులు, విద్యార్థులు అధిఖ సంఖ్యలో హాజరయ్యారు.

పెనుకొండలో రూ.2 కోట్లతో పార్కు

పెనుకొండలో రూ.2 కోట్లతో పార్కు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాతూ…విషయం వెల్లడించారు. ఈ పార్కులో యోగా సెంటర్ తోపాటు మైదానం, ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!