
కుప్పం అభివృద్ధికి 6,339 కోట్లు : ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (న్యూస్ వెలుగు): కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం లో రూ.6,339 కోట్ల పెట్టుబడితో 8 సంస్థలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అమరావతి నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 43 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. బ్యాటరీ టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఫుడ్ లాజిస్టిక్స్, ఫుట్ వేర్, ఇన్నోవేషన్ హబ్ గా కుప్పం రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా కుప్పం స్థానిక రైతులు, ప్రజలతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. గతంలో ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు పరిశ్రమలు రావడంతో వలస వెళ్లాల్సిన అవసరం లేదని స్థానికులు చెప్పారు ఆయన అన్నారు. పరిశ్రమలను సకాలంలో పూర్తిచేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని బెంగళూరు హైదరాబాదు చెన్నై వంటి ప్రాంతాలకు వలస వెళ్లకుండా నివారించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.


