కూటమి ప్రభుత్వం పై బురద చలెందుకు వైస్సార్సీపీ ప్రయత్నం చేస్తోంది: హోమంత్రి అనిత

కూటమి ప్రభుత్వం పై బురద చలెందుకు వైస్సార్సీపీ ప్రయత్నం చేస్తోంది: హోమంత్రి అనిత

న్యూస్ వెలుగు కడప: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తొలిసారిగా ప్రజాస్వామ్యం రుచి చూస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హోమంత్రి తెలిపారు.

ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకే పులివెందులలో పోలింగ్ స్టేషన్ల మార్పు జరిగిందని ఆమె అన్నారు. ఎన్నికల కమిషనర్ అభ్యంతరాల స్వీకరణకు గడువు కూడా పెట్టిందన్నారు. గడువులోగా ఎవరూ అభ్యంతరాలు చెప్పకపోవడం వల్లనే ఎన్నికల కమిషన్ పోలింగ్ స్టేషన్ల మార్చిందని మంత్రి తెలిపారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికలకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అనుమానాస్పద ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!