
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం :సీఎం
న్యూస్ వెలుగు అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఎరువులను అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్ల తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. రైతులకు కావలసిన ఎరువులను ఇప్పటికే అన్ని మండల కేంద్రాల్లోనూ, రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువులు, పురుగు మందుల లభ్యత, సరఫరా అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. కృత్రిమ కొరత సృష్టించినా, దారి మళ్లించినా సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Was this helpful?
Thanks for your feedback!