కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పిఎస్‌ స్థానంలో యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పిఎస్‌ స్థానంలో యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం

న్యూస్ వెలుగు :కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కొత్తగా యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం (యుపిఎస్‌)కి కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. నూతన పెన్షన్‌ పథకం (ఎన్‌పిఎస్‌) స్థానంలో యుపిఎస్‌ను తీసుకొచ్చింది. శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం యుపిఎస్‌కు ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.రూ.10,579 కోట్ల వ్యయంతో సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరే ఏకీకృత పెన్షన్‌ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు 12 నెలల సగటు బేసిక్‌ జీతంలో 50 శాతం పెన్షన్‌గా ఈ పథకం హామీ ఇస్తుందని తెలిపారు. ఈ పథకం 2025 ఏప్రిల్‌ 1 నుండి అమల్లోకి వస్తుందని, కొత్త పథకంతో పదేళ్ల సర్వీస్‌ ఉన్న ఉద్యోగులకు రూ.10 వేలు పెన్షన్‌, 25 ఏళ్ల సర్వీస్‌ ఉన్నవారికి పూర్తి పెన్షన్‌ అందిస్తారని పేర్కొన్నారు. ”ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ పథకాలను సమీక్షించిన తరువాత, అనేకమంది వాటాదారులతో సంప్రదించిన తరువాత కమిటీ ఏకీకృత పెన్షన్‌ స్కీమ్‌ను సూచించింది. ఈ డిమాండ్‌ను పరిష్కరిస్తూ క్యాబినెట్‌ యుపిఎస్‌కి ఆమోదం తెలిపింది” అని పేర్కొన్నారు. కొత్త పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పిఎస్‌)పై అనేక బిజెపియేతర పాలిత రాష్ట్రాల నిరసనలు, త్వరలో హర్యానా, జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్‌ పెన్షన్‌ పథకాన్ని (యుపిఎస్‌) ప్రకటించింది.
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ (డిఎస్‌టి) పరిధిలోని ‘విజ్ఞాన్‌ ధార’ అనే ఏకీకృత కేంద్రరంగ పథకం అమలుకు 2021-22 నుండి 2025-26 వరకు రూ.10,579.84 కోట్లు వ్యయం చేయనున్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకి సంబంధించిన ‘బయో ఇ-3 (ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్‌, ఎంప్లారుమెంట్‌ ఫర్‌ బయోటెక్నాలజీ) పాలసీకి మంత్రివర్గ ఆమోదం లభించింది. ఈ విధానం వల్ల బయో టెక్నాలజీ, బయో సైన్స్‌ రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!