
కేంద్ర విద్యా శాఖ మంత్రి తో సమావేశమైన నారా లోకేష్
పాట్నా (న్యూస్ వెలుగు): కేంద్ర విద్యాశాఖ మంత్రి, బీహార్ బీజేపీ ఎన్నికల ప్రచారకర్త ధర్మేంద్ర ప్రధాన్ తో పాట్నాలో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. బీహార్ లో ఎన్.డీ.ఏ విజయం కోసం ప్రధాన్ శ్రమిస్తున్నారు. గతేడాది హర్యానా, ఒడిశా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయంలో ప్రధాన్ కీలక పాత్ర వహించారన్నారు. బీహార్ లో మరోమారు ఎన్.డీ.ఏ సర్కారును గెలిపించేందుకు ప్రధాన్ చేస్తున్న నిర్మాణాత్మక కృషిని ఈ సందర్భంగా నారా లోకేష్ అభినందించాను. బీహార్ లో మరోమారు ఎన్.డీ.ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేసినట్లు నారాలోకేష్ వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!

