
కొత్తపథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
న్యూస్ వెలుగు అమరావతి: పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రమాద , ఆరోగ్య బీమా పధకాన్ని ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. పట్టణాభివృద్ధిశాఖ – యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ స్కీంను అమలు చేసేలా ఒప్పందం కుదిరిందన్నారు. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్ కార్మికుల శాలరీప్యాకేజ్ ఖాతాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పధకం ద్వారా పస్ర్తుతం రాష్టంలో ఉన్న 55 వేల 686 మంది కార్మికులకు బీమా సదుపాయం లభించనుందని. వీరిలో 39 వేల 170మంది పబ్లిక్ హెల్త్ విభాగంలో ఉండగా, 16 వేల 516 మంది ఇతర విభాగాల్లో పని చేస్తున్నారని వెల్లడించారు. వీరిలో శాశ్వత, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వారందరికీ ఈ పథకం వర్తించనుందని వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!