
క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర నిర్వహించిన జనసేన నాయకులు

జమ్మలమడుగు,న్యూస్ వెలుగు ;మన ప్రియతమ నాయకుడు, కోట్లాది మందికి స్ఫూర్తి ప్రదాత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వేడుకలు, సామాజిక కార్యక్రమాలతో పాటుగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఆయన పిలుపు మేరకు లక్షలాదిగా మొక్కలు నాటుదాం.కోటి మొక్కలు నాటాలనే ఆయన ఆలోచనను ముందుకు తీసుకెళ్దాం అనే కార్యక్రమం లో భాగంగా జమ్మలమడుగు పట్టణంలోజనసేన పార్టీ కో ఆర్డినేటర్ నల్లం శెట్టి నాగార్జున ఆధ్వర్యంలో జమ్మలమడుగు పట్టణంలో స్థానిక ఎండిఓ కార్యలయం ఆవరణంలో నల్లం శెట్టి నాగార్జున మొక్కలు నాటారు. స్థానికి పోలీస్ స్టేషన్ ఆవరణ లో మొక్కలు నటారుఈ కార్యక్రమంలో జమ్మలమడుగు C.I.(సర్కిల్ ఇన్స్పెక్టర్) లింగప్ప , S.I(సబ్ ఇన్స్పెక్టర్) కల్పన వనం గురుకుమార్ జనసేన సీనియర్ నాయకులు, పవన్ కుమార్, మహబూబ్ కాటమరాయుడు, ఉదయ్ కుమార్, వినయ్ కుమార్, హుస్సేన్ వల్లి ,సుధాకర్ ,శభాష్ , తదితర జనసైనికులు పాల్గొన్నారు.