గోకుల కృష్ణ….గోపాల కృష్ణ

గోకుల కృష్ణ….గోపాల కృష్ణ

*భక్తీ శ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు*వేషధారణలతో అలరించిన చిన్నారులు
హోళగుంద, న్యూస్:గోవిందుడు అందరివాడేలే అంటూ గోపికమ్మలు తమ చిలిపి చేష్టలతో గోపాలుడ్ని ఆటపట్టించిన వైనంతో శ్రీ కృష్ణుని జన్మాష్టమి వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.చిన్నారులు చిన్ని కృష్ణులుగా,గోపికలుగా అలంకరించుకుని ఆకట్టుకున్నారు.

కృష్ణుని జననం ప్రపంచానికి మేలు చేకూర్చిందని నమ్మకం.కృష్ణతత్వంలోనే పరమార్థం ఉందని విశ్వాసం.గితోపాదేశం ద్వార ప్రపంచానికి మానవాళికి మనుగడకు మార్గదర్శకం ఇచ్చిన భగవంతుని సారాన్ని కృష్ణుని అవతారంలో కొలవడం రివాజు.అంతేకాకుండా ద్వాపర యుగ శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు శ్రీ కృష్ణునుడు జన్మనిచడాని పురాణాలు చెబుతున్నాయి.శ్రీ కృష్ణుని జన్మదినాన్ని జన్మాష్టమి అనే కాక గోకులాష్టమి అన్ని కూడా అంటారు.

ఇలాంటి పవిత్రమైన రోజును మండల ప్రజలు తమ తమ ఇళ్లలోని చిన్నారులకు శ్రీకృష్ణుని,గోపికల వేషం వేసి,ఆ కృష్ణుని వేషంలో చిన్నారులు చిన్ని చిన్ని పాదాలతో అడుగులు పెడుతూ ఇళ్లలో తిరుగుతుంటే అచ్చం శ్రీ కృష్ణుడు తమ ఇంటికి వచ్చినట్లు ఆనందోత్సవంలో మునిగిపోయారు. అలాగే చుట్టూ పక్కల గ్రామలైన వందవాగలి, కొగిలతోట, గెజ్జెహళ్లి, సులువాయి, హేబ్బటం తదితర గ్రామాల్లో కూడా శ్రీ కృష్ణ జన్మ అష్టమి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!