
గోపూజతో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు న్యూస్ వెలుగు : నిజమైన శ్రేయస్సు అంటే మోక్షమేనని, మోహాన్ని నశింపచేసుకోవడమే మోక్షమని, వస్తుప్రీతి సుఖాన్ని అందించకపోగా దుఃఖ కారకమవుతుందని ఇస్కాన్ ధర్మ ప్రచారకులు కీర్తిరాజదాస్ స్వామి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, పగిడ్యాల మండలం, ప్రాతకోటలో వెలసిన శ్రీ మోక్షేశ్వర స్వామి దేవస్థానం నందు గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా వారు శ్రీమద్రామాయణము, మహాభారతం, భగవద్గీత, శ్రీ వేంకటేశ్వర స్వామి అవతార విశేషాల గురించి భక్తులకు వివరించారు. ముగింపు సందర్బంగా భక్తులందరితో సామూహిక కుంకుమార్చన మరియు గోమాతకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ పి. శేషమ్మ, విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ పూజారి మోక్షేశ్వరుడు, నందికొట్కూరు స్కాలర్స్ పాఠశాల కరెస్పాండెంట్ కాళ్ళూరి లక్ష్మీ, ఆలయకమిటీ సభ్యులు, భజన బృందం సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

