ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

మైలవరం (న్యూస్ వెలుగు ):  మైలవరం లోని స్త్రీ శక్తి భవన్ లో గురువారం రోజు మధ్యాహ్నం మండల విద్యా శాఖాధికారి బత్తిని చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎంపీడిఓ షంషాద్ బాను ముఖ్య అతిథి గా మాజీ ఎంపిపి అల్లె ప్రభావతి విశిష్ట అతిథి గా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత ప్రత్యేక స్థానం గురువులదే. వీరు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారు.

ప్రతి ఒక్కరి జీవితంలో గురువు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులు సరిదిద్ధి వారి జీవితాలను సన్మార్గంలో నడిపిస్తారు. అందుకే ఉపాధ్యాయులకు ఒక రోజు కేటాయించారు. మనదేశంలో ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన పురస్కరించుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారని, ఆయన విద్యా రంగానికి విశేష కృషి చేశారని ఆయన ఉపాధ్యాయుడు, పండితుడు,ప్రఖ్యాత తత్వవేత్త,భారతరత్న పురస్కారం కూడా పొందారు.
భారతదేశంలో 1962 నుండి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గతంలో ఈ మండలంలో పనిచేసి రిటైర్ అయిన ఎంఈఓ జి జె క్రిస్టఫర్, ఎల్ యఫ్ ఎల్ హచ్ ఎమ్ ప్రభాకర్ రెడ్డి, యస్ జి టి కొండారెడ్డి ఈ నెలలో రిటైర్ కాబోతున్న ఎంఈఓ వెంకటేశ్వర్లు లను , దాత అల్లె ప్రభావతి ని కూడా శాలువాలు వాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యఫ్ ఎ సి ఎంఈఓ రమణారెడ్డి మండల ఉపాధ్యాయులు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!