
ఘనంగా బిఆర్ అంబేడ్కర్ 134వ జయంతి
హోళగుంద,న్యూస్ వెలుగు :బహుముఖ ప్రజ్ఞాశాలి,ప్రపంచ మేధావి,దేశ దిక్సూచి రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా మండల కేంద్రంలో అంబేడ్కర్ సామూహిక వివాహా కార్యక్రమం,ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఎమ్మార్పీఎస్ మాజీ తాలూకా అధ్యక్షులు,ప్రముఖ బహుజనవాది చిన్నహ్యట శేషగిరి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.