ఉత్తరప్రదేశ్ : మీర్జాపూర్-వారణాసి సరిహద్దులోని మీర్జామురాద్ సమీపంలో ట్రాక్టర్ ట్రాలీని ట్రక్కు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. 13 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి లారీ ఢీకొట్టినట్లు ఎస్పీ మీర్జాపూర్ అభినందన్ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించారు. వారి చికిత్సపై శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై మిర్జాపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.