జిల్లా ప్రజలకు పరిపూర్ణమైన ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు
కామనురు శ్రీనివాసులురెడ్డి సిఐటియు
కడప,న్యూస్ వెలుగు ;జిల్లాలో కార్మికులు ఉద్యోగులకు ప్రభుత్వ సుపరిపాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు సంతృప్తస్థాయిలో అందాలని, జిల్లా ప్రజలకు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు సిద్దించాలని కోరుకుంటూ.. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని.కామనురు శ్రీనివాసులురెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆకాంక్షించారు.
“వినాయక చవితి” పర్వదినాన్ని పురస్కరించుకుని వారు శుక్రవారం నాడు స్థానిక కడప నగరంలోని సిఐటియు కార్యాలయంలో మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు కార్మికులకు ఉద్యోగులకు తమ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
పండుగలు, వేడుకలు.. మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతిబింబాలు అని.. ఈ వినాయక చవితి పర్వదినం.. ప్రతి ఒక్కరికీ విఘ్నాలను తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వమే నా కాంట్రాక్ట్ ,ఆప్కాస్ ఉద్యోగులను తక్షణం పర్మినెంట్ చేసి రిటైర్మెంట్ అయినా ఉద్యోగులకు రావాల్సిన సౌకర్యాలన్నీ తక్షణం విడుదల చేసి, స్క్రీన్ వర్కర్ల పైన రాజకీయ వేధింపులు నుండి ఆపి ఆ కుటుంబాలను ఆనందంగా సుభిక్షంగా ఉండాలి వినాయక చవితి సంధర్భంగా.. ఆ మహాగణపతి ఆశీస్సులతో.. ప్రతీ కార్మిక , కర్షక ఉద్యోగుల ఇల్లు సంక్షేమ, సౌభాగ్యాలతో శోభాయమానంగా వెలుగొందాలన్నారు. పల్లెసీమలు.. పశుసంపద, వ్యవసాయ, ఉద్యాన పంటలతో సుభిక్షంగా కలకళలాడాలని ఆకాంక్షిస్తూ సిఐటియు ఆ ప్రకటనలో జిల్లా ప్రజలందరికీ “వినాయక చవితి” శుభాకాంక్షలు తెలియజేశారు.