
జోగి రమేష్ అరెస్టు అక్రమం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
తాడేపల్లి (న్యూస్ వెలుగు ): వైయస్సార్సీపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు కుట్ర పూరితమని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు నకిలీ మద్యం వ్యవహారం పై ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ ను ఇరికించినట్లు తెలిపారు. నకిలీ మద్యం వ్యవహారంపై కోటిని ఆశ్రయించిన మరుసటిరోజే జోగి రమేష్ పై నకిలీ మద్యం వ్యవహారంలో తనను ఇరికించారని వారు అన్నారు. నకిలీ మద్యాన్ని తయారు చేసేది వాటిని అమ్మేది విక్రయించేది ఆయా పార్టీలకు చెందిన నేతలేనని బెల్టు షాపుల్లో నకిలీ మద్యం ఏరులై పారుతున్న విషయం ప్రజలకు తెలియడంతో అతని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా వైఎస్సార్ సీపీకి చెందిన నేతలపై అబాండాలను వేటమే కాకుండా వారిని ఉద్దేశపూరితంగా నకిలీ మద్యం కేసులలో ఇరికిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు ఇలాంటివి వాటికి ఎవరు బెదిరిపోరని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నకిలీ మద్యం వ్యవహారంలో ఎందుకు సిబిఐ ఎంక్వయిరీ ఎందుకు వేయించలేదని ఆయన ప్రశ్నించారు.

