
డివిజన్ స్థాయి క్రీడా పోటీలలో సత్తా చాటిన తుగ్గలి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు
తుగ్గలి (న్యూస్ వెలుగు): పత్తికొండలో జరిగిన డివిజన్ స్థాయి క్రీడా పోటీలలో మండల కేంద్రమైన తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. పత్తికొండ డివిజన్ స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నందు తుగ్గలి విద్యార్థులు ఖోఖో,కబడ్డి పోటీలలో,800 మీటర్ల లాంగ్ జంప్ లో రేణుక మొదటి స్థానం కైవసం చేసుకుని జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగిందని పిడి చందు నాయక్ తెలియజేశారు. బాలుర విభాగంలో అండర్ 17 నందు అరుణ్,రంజిత్, రామ్మోహన్,పవన్ ప్రకాష్ రెడ్డి, బాలికల విభాగంలో అండర్ 17 నందు పవిత్ర లక్ష్మి,సమీరా,శిరీష,కబడ్డీ పోటీలలో అండర్ 17 మానస,ఖో ఖో అండర్ 14 విభాగంలో కార్తీక్,కిరణ్,రేణుక, మహాలక్ష్మి,వర్షిణి జిల్లా స్థాయి కి ఎంపిక కావడం జరిగిందని వ్యాయామ ఉపాధ్యాయుడు చందు నాయక్ తెలియజేశారు.పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అగస్టిన్,ఉపాధ్యాయ బృందము అభినందించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాసులు, సుధాకర్ గౌడు,అలీ,గంగావతి,రంగ,రాము,సుంకన్న, నారాయణ,భీమేశ్వర్,సౌభాగ్య,నూర్జహాన్, నాయుడు,వ్యాయామ ఉపాధ్యాయుడు పాండురంగరాజు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


