దళితుల భూములకు రక్షణ కల్పించండి

దళితుల భూములకు రక్షణ కల్పించండి

కర్నూలు (న్యూస్ వెలుగు) : కర్నూలు జిల్లా నూతన బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టి ఎం రమేష్ మాదిగ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని దళితులకు కేటాయించిన అసైన్మెంట్ భూములకు రెవెన్యూ అధికారులు రక్షణ కల్పించకుండా రాజకీయ పలుకుబడి ఉన్న పెత్తందారుల పేర్లు రెవెన్యూ వెబ్ లాండ్ నందు అడంగల్ వన్ బి నమోదు చేసి బాధిత అసైన్మెంట్ డి పట్టా దారులకు మోసం చేస్తున్నారు ఉమ్మడి ఆదోని డివిజన్లో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ గ్రామాల్లో కుల వివక్షత అంటరానితనంతో దళితులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు దళితులకు దేవాలయ ప్రవేశాలు లేవు సమానత్వం సామాజిక న్యాయం లేదు దాడులకు గురైన దళిత బాధితులు పోలీస్ స్టేషన్ కు పోయి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా బాధింపబడిన దళితుడిపై కొంతమంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కేసు నమోదు చేస్తూ దాడి చేసిన ఆధిపత్య వ్యక్తులపై కౌంటర్ కేసు నమోదు చేస్తూ చట్టాలను నీరు కారుస్తూ దళితులను అణచివేస్తూ అన్యాయం చేస్తు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ కేసు విచారణ డిఎస్పీలు విచారణ పేరుతో బాధితులను ఇంట్రాగేషన్ చేస్తూ భయపెడుతూ రాజకీయ సపోర్ట్ ఉన్న వ్యక్తులను కాపాడుతూ అట్రాసిటీ కేసులను నిర్దాక్షణంగా ఫాల్స్ చేస్తూ అన్యాయం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ కేసు బాధితులకు మానిటరింగ్ రిలీఫ్ ఫండ్ త్వరితగతిన అందే విధంగా చర్యలు చేపట్టాలి కుల వివక్షత అంటరానితనం నిర్మూలన కొరకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు దౌర్జన్యాలు హత్యలు, హత్యాచారాలు భూ కుంభకోణాలు నివారించాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రం కలెక్టర్ గారికి సమర్పించడం మైనదని తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి రంగస్వామి ఆచారి

ఎమ్మార్పీఎస్ఎస్ కర్నూల్ సిటీ ప్రెసిడెంట్ గోవిందు మాదిగ కర్నూలు జిల్లా కార్యదర్శి మద్దిలేటి మాదిగ తదితరులు పాల్గొన్నారున్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS