
దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి, విజయవాడ న్యూస్ వెలుగు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం దసరా మహోత్సవములు -2024 సందర్భంగా దసరా పనులలో భాగముగా ప్రతి సంవత్సరం వలె వినాయక స్వామి వారి దేవస్థానం వద్ద ప్రారంభమగు క్యూ లైన్ పనులను ఆదివారం ఆలయ వైదిక కమిటీ వారిచే పూజలు నిర్వహించి,ఆలయ ఈవో కె ఎస్ రామరావు చే క్యూ లైన్ పనులు ప్రారంభించడం జరిగినది. ఇందులో భాగముగా ఉదయం వినాయక స్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి చిత్రపటం నకు ఆలయ వైదిక, అర్చక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి క్యూ లైన్ పనులు ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ లింగం రమాదేవి, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు, డీఈఈ రవీంద్ర, ఏఈ అశోక్, ఏఈఈ మస్తానయ్య మరియు ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొని కొబ్బరి కాయలు కొట్టి దసరా క్యూ లైన్ పనులు ప్రారంభించడం జరిగినది.
అనంతరం ఘాట్ రోడ్ లోని ఓం టర్నింగ్ వద్ద నుండి ప్రారంభమగు దసరా క్యూ లైన్ పనుల కొరకు ఓం టర్నింగ్ వద్ద శ్రీ అమ్మవారి చిత్రపటమునకు పూజలు నిర్వహించి క్యూ లైన్ పనులు ప్రారంభించుట జరిగినది.