దేశంలోనే తొలి విదేశీ విశ్వవిద్యాలయం

దేశంలోనే తొలి విదేశీ విశ్వవిద్యాలయం

ఢిల్లీ ,న్యూస్ వెలుగు : భారత్​లో బ్రిటన్​కు చెందిన సౌథాంప్టన్ యూనివర్సిటీ క్యాంపస్​ను ఏర్పాటు చేయనున్నారు. జాతీయ విద్యావిధానం(ఎన్‌పీఈ) కింద భారత్‌లో క్యాంపస్​ ఏర్పాటు చేయనున్న తొలి విదేశీ విశ్వవిద్యాలయం ఇదేనని విదేశాంగ శాఖామంత్రి జైశంకర్ తెలిపారు. ఈ క్యాంపస్​ను హరియాణాలోని గురుగ్రామ్‌లో ఏర్పాటు చేసేందుకు సౌథాంప్టన్ యూనివర్సిటీ చేసిన ప్రతిపాదలను యూజీసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించిందని ఎక్స్ వేదికగా జైశంకర్​ తెలిపారు. అందుకు సంబంధించిన లెటర్​ ఆఫ్ ఇంటెంట్(ఎల్​ఓఐ)ని యూనివర్సిటీ ప్రతినిధులకు అందజేసినట్లు పేర్కొన్నారు. 2025 జూలై నుంచి కోర్సులు అందుబాటులోకి రానున్నాయని యూజీసీ ఛైర్మన్ జగదీశ్​ కుమార్ తెలిపారు. ప్రధానంగా బిజినెస్ అండ్ మేనేజ్​మెంట్, కంప్యూటర్, లా, ఇంజినీరింగ్, ఆర్ట్ అండ్ డిజైన్, బయో సైన్సెస్, లైఫ్ సైన్సెస్​కు సంబంధించిన కోర్సులు ఉంటాయన్నారు. సౌథాంప్టన్​ ‘ఇండియా క్యాంపస్’ అందించే డిగ్రీలు హోస్ట్ యూనివర్శిటీలో ఉన్నట్లే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!