
దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ: ఏపీ పీసీసీ
ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు): లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ నిన్న పేల్చింది. హైవోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్. తీగ లాగుతుంటే డొంక కదిలినట్లు..దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా రాహుల్ గాంధీ తీగ బయటకు లాగుతున్నారు. హర్యానాలో రెండు కోట్ల ఓట్లు ఉంటే.. 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. ఎనిమిది మందికి ఒక దొంగ ఓటు చేర్చారు. లక్షా 18 వేల ఓట్ల తేడాతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 25 లక్షల దొంగ ఓట్లు చేర్చారు కాబట్టే బీజేపీ అధికారంలోకి వచ్చింది.. అంటే దొంగ ఓట్లు లేకుంటే బీజేపీకి అధికారం రాలేదు. దీనిని బట్టి హర్యానాలో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారని తేలింది. సర్వేలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇచ్చాయి. అయినా కానీ బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధి బయట పెట్టారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌గా పని చేస్తోంది. బీజేపీ అన్ని వ్యవస్థలను ఇప్పటికే భ్రష్టు పట్టించింది. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా భ్రష్టు పట్టేలా చేసింది. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడటం కాంగ్రెస్ నినాదం. అనేక రాష్ట్రాల్లో దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దొంగ ఓట్లపై నిజాలు బయట పెడుతుంటే ECI నుంచి సమాధానం లేదు. ఓటర్ లిస్ట్ బయట పెట్టడం లేదు. CCTV ఫుటేజ్ ఇవ్వాలి అంటే వాటిని ధ్వంసం చేశారు. డిజిటల్ డేటా ఎందుకు ఇవ్వడం లేదు ? దొంగ ఓట్లకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ మొదలు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ నుంచి 17.65 లక్షల సంతకాలు సేకరణ చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ నుంచి 17.65లక్షల మందికి కృతజ్ఞతలు చెప్తున్నాం.

