
నదుల వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి సమీక్ష
న్యూస్ వెలుగు అమరావతి: కృష్ణా, గోదావరి నదుల వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ నుంచి టెలికాన్ఫరెన్సు ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నుంచి 5.20 లక్షలు, నాగార్జున సాగర్ నుంచి 4.32 లక్షలు, పులిచింతల నుంచి 4.07 లక్షలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.53 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నది వరద ప్రవాహం కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 13,42,307 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!