
నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలి: కాంగ్రెస్ నేత వైయస్ షర్మిల
కృష్ణా జిల్లా (న్యూస్ వెలుగు ): కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో మొంథా తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తెలిపారు. రాష్ట్రంలో రైతాంగానికి ఇంత నష్టం జరిగితే ప్రధాని మోడీ గారు నోరు విప్పలేదని, మోడీ గారు ఆయన కోసం రాష్ట్రానికి వస్తారు పోతారని ఏద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యల మీద మాత్రం మాట్లాడని మోడీకి మోసం చేయడం అలవాటుగా మారితే దాన్ని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మురిసిపోతున్నారని ఆమే అన్నారు. బీజేపీ కేంద్రంలో నిలబడి ఉంది అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మద్దతుతోనే నని వారు అన్నారు. ఆంధ్రా రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే మోడీకి రాష్ట్ర సమస్యలు కనపడవు. కేవలం ఓట్లు కోసమే ఆంధ్రా ప్రజలను వాడుకుంటున్నారని బీజేపీ పై విమర్శలు చేశారు.
రాష్ట్రంలో ఉచిత పంట బీమా పథకానికి దిక్కులేదని, గత YCP పాలనలో మూడేళ్లు బీమా ఇవ్వలేదన్నారు. కేంద్ర మంత్రి పార్లమెంట్ వేదికగా YCP రూ.3వేల కోట్లు రాష్ట్ర వాటా పెండింగ్ పెట్టింది అని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం ఉచిత బీమా అమలు చేయడం రైతులకు కంఠతడిని మిగిల్చిందన్నారు. రాష్ట్రంలో 80 లక్షల మంది రైతులకు ఉచిత బీమా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తుఫాన్ కారణంగా నష్టం జరిగితే చంద్రబాబు రూ.5వేలు ఇచ్చారట. నష్టం లక్షల్లో జరిగితే..పరిహారం రూ.5 వేలు ఇస్తే సరిపోతుందా ? కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం తుఫాను ప్రభావాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

