నాపై తప్పుడు రాతలు వద్దు   సిట్ దర్యాప్తుకు సహకరిస్తా: మాజీ ఉపముఖ్యమంత్రి

నాపై తప్పుడు రాతలు వద్దు  సిట్ దర్యాప్తుకు సహకరిస్తా: మాజీ ఉపముఖ్యమంత్రి

న్యూస్ వెలుగు అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఉపముఖ్యమంత్రి , వైసీపీ నేత కె నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు లేని రేపులు,దౌర్జన్యాలు,అరాచకాలను కల్లారా చూడాల్సిన దౌర్భాగ్యం నెలకొని ఉందన్నారు. ఎలాంటి తప్పులు చేయని వారిపై తప్పుడు కేసులను బనయిస్తున్నారని వారు ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కుంభకోణంలో తనను తప్పుడు కేసులతో ఇరికించినట్లు తెలిపారు. లిక్కర్ స్కాం కుంభకోణంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుందని, సిట్ దర్యాప్తుకు తాను సహకరిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలు ఎప్పుడు వాస్తవాలు గానే ఉంటాయని వాటిని ఎవరు మార్చలేరన్నారు. కొన్ని మీడియాలు తనను వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాస్తున్నాయని ఇది సరైన పద్ధతి కాదని ఆయన సూచించారు. సిట్ దర్యాప్తుకు తను వాడే ల్యాప్టాప్ ను అందజేసినట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!