
నియామక పత్రాలు అందించిన ముఖ్యమంత్రి
తెలంగాణ (న్యూస్ వెలుగు): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరిచేతిగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వారు తెలిపారు. గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దీపావళి వేళ గ్రూపు-2 అభ్యర్థులతో పాటు వారి కుటుంబాల్లో ఆనందం కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువతది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
Was this helpful?
Thanks for your feedback!