నిరుద్యోగ సమస్యను కేంద్ర మంత్రికి వివరించిన హుస్సేనప్ప

నిరుద్యోగ సమస్యను కేంద్ర మంత్రికి వివరించిన హుస్సేనప్ప

తెలంగాణ:   హైదరాబాద్ లో  కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి  రామదాసు అథవాలె కి దృస్టికి  నిరుద్యోగ సమస్యలను వివరించినట్లు ఆంద్ర ప్రదేశ్ ఆర్‌పి‌ఐ పార్టీ ఉపాద్యక్షులు హుస్సేనాప్ప తెలిపారు.

సివిల్ ఇంజనీర్లకు నామినేషన్ పద్ధతిలో సివిల్ వర్క్స్ కేటాయించి వారికి ఉపాధి కల్పించాలని వారు కోరినట్లు తెలిపారు. ఏడాది కాలంలో లక్షల  మంది యువత డిగ్రీలు చేతపట్టుకుని బయటకు వస్తున్నారని, అయితే వారికి సరైన ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయని హుస్సేనాప్ప కేంద్ర మంత్రి దృస్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. నిరుద్యోగులైన యువత ఉద్యోగ , ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందని , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణ రంగంలో యువతకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలని , నిర్మాణ రంగంలో యువ ఇంజినీర్లకు బ్యాంకుల నుండి రుణాలు , ఇతర సబ్ సీడీ పథకాలు అందించాలని  రాష్ట్ర నాయకులు హుస్సేనాప్ప కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!