
నేటితో ముగియనున్ననామినేషన్ల స్వీకరణ
జార్ఖండ్ : రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు నేటితో ముగియనుంది. ఈ దశలో ముప్పై ఎనిమిది నియోజకవర్గాలకు నవంబర్ 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు 632 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 30వ తేదీన జరుగుతుందని, అభ్యర్థులు నవంబర్ 1వ తేదీ వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
ఇదిలావుండగా, అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సోదాల్లో 86 కోట్ల 32 లక్షల రూపాయల విలువైన అక్రమ సామగ్రి, నగదు స్వాధీనం చేసుకున్నారు. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఇరవై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
Was this helpful?
Thanks for your feedback!