నేడే శ్రీ సాయిబన్న తాత ఉరుసు ఉత్సవాలు

నేడే శ్రీ సాయిబన్న తాత ఉరుసు ఉత్సవాలు

హొళగుంద, న్యూస్: మండల కేంద్రంలో మతసామరస్యానికి ప్రతీకగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వరకు ఉరుసు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.ప్రధానంగా సోమవారం అర్ధరాత్రి గరడి మనే నుంచి గంధం గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి తెల్లవారుజామున సాయిబన్న తాత దర్గాకు చేరుకుంటుంది.శ్రీ సద్గురు సాయిబన్న తాత ఒక సామాన్య వ్యక్తిగా జీవించి భక్తులకు ఎన్నో పవాడలను చూపి నేడు ఆరాధ్య దైవగా వెలిగాడని భక్తులు చెప్తున్నారు.అలాగే ఆంధ్ర,కర్ణాటక నుంచి భక్తులు కులమతా గాలకు అతీతంగా ప్రతి గురువారం,అమావాస్యల రోజున దాదా వారి దర్గాకు తరలివచ్చి అనుకున్న మొక్కులు తీర్చుకొని రాత్రి నిద్రే చేస్తే తమ తమ సమస్యలను తీరుతాయని భక్తుల నమ్మకం.

Authors

Was this helpful?

Thanks for your feedback!