పదిమంది భక్తులు మృతి:  టీటీడీ మాజీ చైర్మన్ 

పదిమంది భక్తులు మృతి:  టీటీడీ మాజీ చైర్మన్ 

తిరుపతి (న్యూస్ వెలుగు): శ్రీకాకుళం జిల్లాలోని  కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి   దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులు ఇలా మరణించడం బాధాకరమని దేవాదాయ శాఖ అధికారులు భక్తుల దర్శనానికి కావలసిన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పదిమందికి పైగా మరణించడం బాధాకరమని, భక్తుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుందని టిటిడి మాజీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చాక దైవ దర్శనాల్లో అనేక చోట్ల టీటీడీని మొదలుకొని అనేక దేవాలయాల్లో తొక్కిస్లాటలు జరిగాయని దైవ దర్శనానికి వచ్చిన భక్తులకు భద్రత లేకుండా పోయిందని వారు అన్నారు. భక్తులకు ఏర్పాట్లను చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేంతవరకు వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని బాధిత కుటుంబాలకు వారు భరోసానిచ్చారు. కూటమి ప్రభుత్వం భక్తులకు భక్తుల మనోభావాలకు దెబ్బతినేలా వ్యవహరిస్తుందని దీనికి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!