పదిలక్షల ఇల్ల నిర్మాణాలు చేపట్టాలి: సీఎం

పదిలక్షల ఇల్ల నిర్మాణాలు చేపట్టాలి: సీఎం

న్యూస్ వెలుగు అమరావతి: గృహ నిర్మాణ శాఖ సంబంధిత అంశాలపై  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. మరో 3 నెలల్లో 3 లక్షల ఇళ్లు, సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తి కావాలని సీఎం అధికారులను ఆదేశించారు. పట్టణ పేదలకు 2 సెంట్లు, గ్రామీణ పేదలకు 3 సెంట్లు భూమి కేటాయిస్తామనే హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు పి నారాయణ,  కె.పార్ధసారధి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!