పవిత్ర కృష్ణ నదీమ తల్లికి నవహారతులు ఇచ్చుటకు ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి, విజయవాడ,న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు పవిత్ర కృష్ణ నదీమ తల్లికి నవహారతులు ఇచ్చుటకు గాను దుర్గా ఘాట్ లో సదరు ఏర్పాట్ల నిమిత్తం ఆలయ వైదిక కమిటీ సభ్యులతో చర్చించి తగు ఏర్పాట్లు పూర్తి చేయవలసినదిగా ఆలయ అధికారులకు ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కార్యనిర్వాహనాధికారి లీలా కుమార్, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ మరియు వైదిక సిబ్బంది, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లింగం రమాదేవి, ఏఈఓ ఎన్ రమేష్, ఆలయ డిఈ లు, ఏఈఈ లు, ఇంజినీరింగ్, అర్చక మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!