
పాఠశాలల సమయాన్ని పెంచడం విచారకరం : ఉపాధ్యాయ సంఘాల నాయకులు
కర్నూలు న్యూస్ వెలుగు : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల సమయాన్ని పైలట్ ప్రాజెక్టు పేరుతో సాయంత్రం ఐదు వరకు పెంచడం సమంజసం కాదని, ఇలా ఏ రాష్ట్రంలో లేని విధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ జి ఎస్ గణపతి రావు, కె ప్రకాష్ రావు పత్రికా ప్రకటనలో తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు లాభం కన్నా నష్టాలు ఎక్కువ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం శీతాకాలం అయినందున సాయంత్రం ఐదు ఇరవై నిమిషాలకే సూర్యాస్తమయం అవుతున్నందున పాఠశాల విడిచిన తర్వాత చీకటిలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు తమ తమ గ్రామాలకు చెరెందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇలా అనేక ఇబ్బందులు కొన్ని అవాంఛిత సంఘటనలు జరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 9 ,10 తరగతిలో చదువుతున్న విద్యార్థులు యుక్తవయసులో ఉన్నందున మార్గమధ్యంలో వారికి కొన్ని అసాంఘిక దుశ్చర్యలు జరిగే అవకాశం ఉందని వాపోయారు. ప్రభుత్వం పాఠశాల లను ప్రయోగశాలలుగా మార్చవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కొరతామన్నారు.
