పాత టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం : మంత్రి నారాయణ
అమరావతి అభివృద్ది పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను రద్దు చేసినట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. త్వరలోనే నూతన టెండర్లను పిలిచే ప్రక్రియను ప్రారంభించి రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ది పనులను అన్నింటినీ పూర్తి చేస్తామని అయన వెల్లడించారు. ఇప్పటికే అభివృద్ధి పనులపై అనేక కమిటీలు వేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అమరావతిని నిర్మించేందుకు క్రుసిచేస్తుందని వారు అన్నారు. ఆదిశ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!