
పార్టనర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి
అమరావతి,( న్యూస్ వెలుగు): విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025 సన్నాహక ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాను. పార్టనర్ షిప్ సమ్మిట్‌కు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, అశ్వనీ వైష్టవ్ హాజరు కానున్నారు. ఇప్పటివరకు 45 దేశాల నుంచి 300 మంది వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నట్లు సమాచారం ఉంది. సమ్మిట్ లో 12 మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ పాల్గొంటారు. 48 స్పీకింగ్ సెషన్స్ లో సెక్టార్ల వారీగా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతాం. ఈసారి పార్టనర్ షిప్ సమ్మిట్ లో 410 ఎంవోయూలపై సంతకం చేయబోతున్నాం. వీటిద్వారా రూ.9.8లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయి.
Was this helpful?
Thanks for your feedback!
			
