పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటాం: డాక్టర్ మద్దిలేటి స్వామి

పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటాం: డాక్టర్ మద్దిలేటి స్వామి

డోన్

న్యూస్ వెలుగు : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఆదేశాల మేరకు, “సంఘటన్ సృజన్ అభియాన్” (సంస్థాగత నిర్మాణ కార్యక్రమం)ను డిసెంబర్ 1 వ తేదీన డోన్ పట్టణములో కాంగ్రెస్ పార్టీ కార్యాలయములో జరుగుతుందని డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, న్యాయవాది డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి,& నంద్యాల డిసిసి ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్ లు ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ కార్యక్రమానికి బెంగుళూరు, శాంతి నగర్ అసెంబ్లీ ఎమ్ ఎల్ ఏ, & బెంగుళూరు డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ పరీశీలకులు శ్రీ నలపాడ్ అహ్మద్ హారిస్ (ఎన్. ఏ హారీష్) , ఏఐసీసీ మెంబర్, కర్నూల్ జిల్లా ఇంచార్జి, నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ జంగిటి లక్ష్మి నరసింహ ,

ఏ పి సి సి ప్రదాన కార్యదర్శి,ఏఐసీసీ మెంబర్ శ్రీ ఈ. సుధాకర్ రెడ్డి గారు అసంఘటిత ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్ కైపు వెంకట కృష్ణా రెడ్డి, బీడీమ్ చైర్మన్ శ్రీ బొర్రా శ్రీధర్ లు పాల్గొంటారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ

కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి సంస్థాగత నిర్మాణంలో భాగంగా, నంద్యాల పార్లమెంట్ లో ని అన్ని నియోజకవర్గా లో పర్యటించి పార్టీ పరిస్థితి ని అధిష్టానము దృష్టికి తీసుకవేళ్తారు. అంతే కాకుండా నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడిగా ఆసక్తి కలిగిన పార్టీ నాయకుల నుంచి దరఖాస్తులను (అప్లికేషన్లను) స్వీకరించి

నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ పార్టీని జిల్లాలో అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు పటిష్టమైన చర్యలు చెపట్టడంలో భాగంగా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, న్యాయవాది డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి,& నంద్యాల డిసిసి ఉపాధ్యక్షులు,న్యాయవాది ఉన్నిగొర్ల జనార్దన్,డోన్ మండల అధ్యక్షులు పఠాన్ మహబూబ్ హుస్సేన్, బేతంచెర్ల మండల అధ్యక్షులు ధోని రామాంజనేయులు, ప్యాపీలి మండల అధ్యక్షులు శనగల మహేంద్ర నాయుడు.తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS