
పింఛన్లను పంపిణీ చేసిన సిఎం
విజయనగరం న్యూస్ వెలుగు : గజపతినగరం నియోజకవర్గం, దత్తిగ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లను పంపిణీ చేశారు. కిడ్నీసమస్యతో బాధపడుతున్న పొంతూరు అప్పలరాజుకు పింఛను అందజేశారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక సభకు వస్తున్న సమయంలో చిన్నారులు దగ్గరకు రాగా వారితో ఆప్యాయంగా మాట్లాడి ఫోటోలు దిగారు.


Was this helpful?
Thanks for your feedback!