
పూజా కేడ్కర్‌కు కేంద్రం షాక్.. సర్వీసు నుంచి తొలగింపు
ఢిల్లీ ,న్యూస్ వెలుగు: వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ (Puja Khedkar)పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్‌సీ (UPSC) రద్దు చేసిన కొద్ది వారాలకు కేంద్రం తాజా చర్యలు తీసుకుంది. ఐఏఎస్ (Probation) రూల్స్ 1954 కింద ఆమెను ఐఏఎస్ నుంచి తొలగించినట్టు కేంద్రం పేర్కొంది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) నుంచి తొలగించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది.రూల్-12 కింద ప్రొబేషనర్లు రీఎగ్జామినేషన్‌లో ఫెయిల్ అవడం, ఐఏఎస్ సర్వీసుకు రిక్యూట్‌మెంట్‌కు అనర్హురాలిగా గుర్తించడం, సర్వీసులో కొనసాగడానికి తగరని భావించిన పక్షంలో వారిని తొలగించే అధికారం కేంద్రానికి ఉంటుంది.
Was this helpful?
Thanks for your feedback!