
పెన్షన్ల పై కీలక సూచనలు చేసిన సీఎం
న్యూస్ వెలుగు ఏపీ సచివాలయం : ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని వికలాంగ పెన్షన్ పొందుతున్నవారిపై ఇటీవల జరిపిన పున:పరిశీలన వివరాలను అధికారులు సీఎం ముందుంచారు. ప్రత్యేక వైద్య బృందాలను నియమించి సదరం సర్టిఫికెట్ల పున:పరిశీలన జరిపినట్లు తెలిపారు. అర్హులైన వారిలో ఒక్కరికి కూడా అన్యాయం జరగరాదని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పెన్షన్, హెల్త్ పెన్షన్ పొందేవారికి కూడా ఎప్పటిలా నెలనెలా పింఛన్ అందించాలని సీఎం స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని చెప్పారు.
Was this helpful?
Thanks for your feedback!