
పేద ప్రజల ఆకలి ఆశలు తెలిసిన నేత ఆయన : ఎమ్మెల్యే శ్యామ్ కుమార్
పత్తికొండ న్యూస్ వెలుగు : తెలుగు జాతి ప్రతీక , కోట్లాది మంది హృదయాలలో చిరస్థాయిగా నివసిస్తున్న మహానాయకుడు, దివంగత నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్నిశుక్రవారం మద్దికెర మండలం, ఏడవలి గ్రామంలో ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … పేద ప్రజల ఆకలి, ఆశలు, కలలను గుండెల్లో పెట్టుకొని పనిచేసిన మహానాయకుడని, తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు గౌరవాన్ని ప్రపంచానికి చాటిన యుగపురుషుడని ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ కొనియాడరు…. అన్నం పెట్టే ప్రభుత్వం, ఆత్మగౌరవం కలిగించే పాలన, పేదలకు గౌరవం ఇచ్చే నాయకత్వం ఇవన్నీ ఎన్టీఆర్ పాలనలోనే ప్రజలు నిజంగా అనుభవించారని గుర్తుచేశారు. ఆయన చూపించిన బాటలోనే తెలుగుదేశం పార్టీ నడుస్తోందని, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి కార్యకర్తకు, ప్రతి తెలుగువానికీ బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఏడవలి గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించారు.

