పొన్నెకల్లు గ్రామంలో పర్యటించిన సీఎం

పొన్నెకల్లు గ్రామంలో పర్యటించిన సీఎం

గుంటూరు న్యూస్ వెలుగు : గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గం, పొన్నెకల్లు గ్రామంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏస్సీ సామాజికవర్గానికి చెందిన నవీన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపును పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రూ.102.07 కోట్లతో నిర్మించతలపెట్టిన సాంఘిక సంక్షేమ వసతి భవనాలకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం గత టీడీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి ఎంపికై విదేశాల్లో చదువుకుని స్థిరపడిన రత్నలత, అనిల్ అనే ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS