పోలిసే దొంగైతే..! ఆలెక్కే వేరు మామ

పోలిసే దొంగైతే..! ఆలెక్కే వేరు మామ

కర్నూలు క్రైం (న్యూస్ వెలుగు) : పోలీసే దొంగ అయితే ఆ కిక్కే వేరప్పా! అనిపించే ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. దొంగ తనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు ఏకంగా కానిస్టేబుల్ కావడం సంచలనం రేపింది. కర్నూలు 4వ పట్టణ సీఐ విక్రమ్ సింహ తెలిపిన వివరాల ప్రకారం… కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృపానందం (42), పాత నేరస్తుడు జగదీశ్ (25)తో చేతులు కలిపాడు. గన్నవరం సబ్ జై లులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఖైదీ జగదీశ్తోతో పరిచయం ఏర్పడటంతో వీరిద్దరూ కర్నూలులో దొంగతనాలకు పక్కా ప్రణాళిక రచించారు. జగదీశ్లపై ఇప్పటికే 25 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కృపానందం గతంలో ఖమ్మం పోలీసులు పట్టుకుని

 

రెండుసార్లు సస్పెండ్ చేసినట్లు వెల్లడైంది. ఈసారి కర్నూలులో ఇద్దరూ కలసి ఇళ్ల తాళాలు పగల గొట్టి బంగారం, నగదు దోచుకున్నారు. దొంగ తనం చేసిన ఆభరణాలను కృపానందం కుప్ప వరం మార్కెట్లో అమ్మి డబ్బు చేసుకున్నాడు. తాజాగా కర్నూలులో మరో కేసు నమోదు కావడం తో పోలీసులు గుట్టు రట్టు చేశారు. నిందితులిద్ద రిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 4.2 తులాల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకు న్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS