
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
తుగ్గలి (న్యూస్ వెలుగు): ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.బుధవారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల రాంపల్లి గ్రామం వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తోందికార్యక్రమాన్ని వారు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు,టిడిపి మండల అధ్యక్షుడు తిరుపాలు నాయుడు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ద్రవ జీవామృతం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు ద్రవ జీవామృతం తయారు చేసే విధానాన్ని గ్రామ రైతులకు వారు వివరించారు.అలాగే భూమాత రక్షణ కార్యక్రమంలో భాగంగా రైతులు వాడుతున్న రసాయనిక ఎరువుల దుష్పరిణామాలు,భూమిపై ఎలా ఏ విధంగా ప్రభావం చూపుతోందో అని రైతులకు తెలియజేశారు.భూమి యొక్క స్వభావాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా రైతులకువారు అవగాహన కల్పించారు.అలాగే ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించి రైతులకు పంటల దిగుబడి పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి మల్లేష్,సచివాలయ ఉద్యోగులు,రైతులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

