ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఆలూరు టీడీపీ ఇంచార్జ్ బి.వీరభద్ర గౌడ్
ఆలూరు,న్యూస్ వెలుగు : ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బి వీరభద్ర గౌడ్ సూచించారు.ఈ సందర్భంగా ఇంచార్జ్ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు ఉన్న తరుణంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. మ్యాన్ హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని అధికారులకు తెలియజేశారు.