ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ బస్తిపాటి నాగరాజు 

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ బస్తిపాటి నాగరాజు 

కర్నూలు (న్యూస్ వెలుగు):ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నవంబర్ మాసంలో జిల్లాలో అర్హులైన 2 లక్షల 37 వేల 904 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.103.82 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో నూర్జబి, బోయ పద్మావతి లకు వితంతువు పెన్షన్, ఖాజా హుస్సేన్, అజ్గర్ బాషా లకు వికలాంగుల పెన్షన్, మహబూబ్ బాషా కి వృద్ధాప్య పెన్షన్ లను వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్, కర్నూలు ఎంపీ అందజేశారు. ఈ సందర్భంగా పెన్షన్ లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ కలెక్టర్ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ ప్రతినెల సరైన సమయానికి వచ్చి అందిస్తున్నారా అని కలెక్టర్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అజ్గర్ బాషా కు వైకల్య పెన్షన్ అందచేస్తున్న సమయంలో వైకల్యం ఉన్న సర్టిఫికెట్ లు రైలు ప్రయాణం చేసే సమయంలో పోగొట్టుకున్నానని సర్టిఫికెట్ లు ఇప్పించాలని కలెక్టర్ ని కోరగా, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపిడిఓ ను ఆదేశించారు. పొలాలకు వెళ్లేందుకు దారులు కావాలని, మాదాసి, మదారి కురువలకు క్యాస్ట్ సర్టిఫికెట్ లు ఇవ్వాలని, భూ సమస్య లు పరిష్కరించాలని గ్రామ ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్ లను అందించేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిఆర్డిఎ పిడి రమణారెడ్డి, కర్నూలు రూరల్ తహసిల్దార్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!