
ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
తుగ్గలి (న్యూస్ వెలుగు): ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 12వ తేదీన నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ నందు మాజీ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించు ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి తుగ్గలి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్,వైసీపీ సేవాదళ్ జిల్లా నాయకులు తుగ్గలి మోహన్ రెడ్డి,మండల అధ్యక్షుడు అట్లా గోపాల్ రెడ్డిలు తెలియజేశారు.ఈ సందర్భంగా సోమవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలి నందు ప్రతాపరెడ్డి నివాసం నందు ప్రజా ఉద్యమం కు సంబంధించి పోస్టర్లను వారు విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని వారు తెలియజేశారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే వరకు ఈ ప్రజా ఉద్యమం ఆగదని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కావున 12న జరిగే ప్రజా ఉద్యమం కార్యక్రమానికి మండల పరిధిలోని గల వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాతన మోహన్ రెడ్డి, తుగ్గలి ఎంపీటీసీ రాజు,మాజీ సర్పంచ్ పురుషోత్తం,మామిళ్ళకుంట సత్యప్ప, అమీనాబాద్ మాజీ సర్పంచ్ రామాంజనేయులు,బాట తాండ సర్పంచ్ గౌరవ సలహాదారుడు రాము నాయక్,గిరిగేట్ల విష్ణువర్ధన్ రెడ్డి తదితర మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

