
ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్
మంగళగిరి (న్యూస్ వెలుగు) : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించాను. సమస్యలు విన్నవించేందుకు పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. వారి నుంచి అర్జీలు స్వీకరించాను. వైసీపీ పాలనలో భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని శ్రీకాకుళం జిల్లా బుడ్డేపుపేటకు చెందిన దనపాన హరికృష్ణ, అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న తనను వైసీపీ హయాంలో అక్రమంగా విధుల నుంచి తొలగించారని, తిరిగి తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఉలిద్ర రవి, పారామెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ మేల్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది, రోడ్డు ప్రమాదంలో గాయపడిన తనకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్యసాయం అందించాలని చిత్తూరు జిల్లా కన్నికాపురానికి చెందిన కె.ప్రకాశ్ బాబు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.

