ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలి: ఎమ్మెల్యే సింధూర రెడ్డి

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలి: ఎమ్మెల్యే సింధూర రెడ్డి

పుట్టపర్తి న్యూస్ వెలుగు :  నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అధికారులకు సూచించారు.పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజవర్గ సమస్యలపై ప్రజా గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించి వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో తమ బాధ్యతలు నిర్వర్తించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు . ఒక గ్రీవెన్స్ లో ఇచ్చిన అర్జీలు మళ్ళీ అవే అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎక్కువుగా గ్రీవెన్స్ లో రెవిన్యూ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని వీటికి తక్షణం శాశ్వత పరిష్కారం చూపాలని రెవిన్యూ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ గ్రీవెన్స్ కు ఎక్కువుగా రెవిన్యూ పరంగా ఆస్తి వివాదాలు , డ్రైనేజ్ సక్రమంగా లేదని ,కొత్త సీసీ రోడ్లు కావాలని నూతన పెన్షన్లు ,పక్కా గృహాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కి పలువురు లబ్ధిదారులు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు కొత్త చెరువు ,బుక్క పట్నం, పుట్టపర్తి మండలాల తహశీల్దార్లు , ఎంపిడిఓలు ,ఆర్ డబ్యు ఎస్ ,పంచాయతీరాజ్ , వ్యవసాయ అధికారులు ,ఉద్యానవన ,విద్యుత్తు ,డిపీఓ, డ్వామా , డిఆర్ ర్డీఏ వెలుగు, హౌసింగ్ అధికారులు ,ప్రజా ప్రతినిధులు ,అర్జిదారులు ,కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!