హోళగుంద,న్యూస్:మండల కేంద్రంలో సోమవారం స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు.ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఇందులో భాగంగా గ్రామ సభ సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సమావేశంలో కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారిస్తున్నామన్నారు.అనంతరం టీడీపి నాయకులు ఎర్రిస్వామి,పంపాపతి,మోహిన్,వలి,చిదానంద,ప్రసాద్ తదితరులు 2వ వార్డులో డ్రైనేజ్ లో పేరుకుపోయిన చెత్త చెద్దారనీ తొలగించాలి,నీలకంఠరాయ స్వామి దేవాలయం వెనుక భాగంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి మరియు త్రాగునీరు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాటిని సత్వరమే పరిష్కరించాలని కార్యదర్శిని నిలదీశారు.ఇందుకు కార్యదర్శి రాజశేఖర్ సానుకూలంగా స్పందిస్తూ గ్రామంలో సమస్యలను ఒక్కొకటిగా పరిష్కరిస్తూ వస్తామని హామీ ఇచ్చారు.తదనంతరం ఈఓపిఆర్డి చక్రవర్తి మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ్,వార్డు సభ్యులు చిన్న మల్లయ్య,లింగమ్మ,రవికాంత్,సర్పంచ్ తనయుడు పంపాపతి,ఏఎన్ఎంలు,సచివాలయం సిబ్బంది,అంగన్వాడి కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!