ప్రతి జిల్లాలో జాబ్ మేళాలు తప్పని సరి

న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో ప్రతి మూడు, ఆరు నెలలకొకసారి జాబ్ మేళాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో నైపుణ్య గణన పూర్తయ్యేలోగా .. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి జోన్కు ఒక ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలని ఆయన స్పస్టం చేశారు. ఇంటి వద్ద నుంచి పని విధానంలో నమోదు చేసుకున్నవారికి ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. క్లస్టర్ ఆధారిత విధానంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణ ప్రారంభించామని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS