ప్రతి బాలికకు సరైన భద్రత ను కల్పించాలి: జిల్లా కలెక్టర్ సిరి

ప్రతి బాలికకు సరైన భద్రత ను కల్పించాలి: జిల్లా కలెక్టర్ సిరి

కోడుమూరు ( న్యూస్ వెలుగు): వసతి గృహాల్లో ఉన్న ప్రతి బాలికకు సరైన భద్రత, పోషకాహారం, మంచి విద్య ను అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కోడుమూరు మండలం లోని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల వసతి గృహం, వెనుకబడిన తరగతుల ప్రభుత్వ బాలికల వసతి గృహాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహాల్లో విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యా బోధన ఏ విధంగా చెబుతున్నారు?వారు చెప్పే పాఠాలు అర్థం అవుతున్నాయా?? భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా?భోజనం రుచిగా ఉంటుందా?యూనిఫాం ఇచ్చారా?అనే విషయాలను కలెక్టర్ కలెక్టర్ విద్యార్థులతో ఆరా తీశారు?? ఉపాధ్యాయులు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తున్నారని, భోజనం చాలా రుచిగా పెడుతున్నారని, యూనిఫాం లు ఇచ్చారని విద్యార్థులు కలెక్టర్ కి వివరించారు… విద్యార్థులు అందరూ బాగా కష్టపడి చదువుకొని వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల వసతి గృహం, వంట గదిని పరిశీలిస్తూ మెనూ ప్రకారం భోజనం అందజేస్తున్నారా ?? వారంలో ఎన్ని రోజులు చికెన్ , గుడ్డు పెడుతున్నారు?? పిల్లలు ఇష్టంగా ఏ స్నాక్స్ తింటారనే వివరాలను వంట గది సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.. మెనూ ప్రకారం చేసిన భోజనాన్ని కలెక్టర్ రుచి చేసి సంతృప్తి వ్యక్తం చేశారు… అనంతరం డైనింగ్, డార్మిటరీ లను తనిఖీ చేస్తున్న సమయంలో సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల వసతి గృహం వార్డెన్ పెచ్చులు ఊడిపోయాయని కలెక్టర్ దృష్టికి తెచ్చారు..మరమ్మతులకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. టాయిలెట్ లు మరింత శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సాంఘిక సంక్షేమ సిబ్బందిని ఆదేశించారు.

వెనుకబడిన తరగతుల ప్రభుత్వ బాలికల వసతి గృహం, వంట గదిని పరిశీలిస్తూ పిల్లలకు మెనూ ప్రకారమే భోజనం అందించాలన్నారు. ప్రతి రోజు వంట సరుకుల వివరాలు రికార్డు మెయింటైన్ చేయాలన్నారు. కార్యక్రమంలో కోడుమూరు మండలం ఇంచార్జి ఎంపిడిఓ కృష్ణారెడ్డి, ఇంచార్జి తహసిల్దార్ కృష్ణ మూర్తి, సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల వసతి గృహం వార్డెన్ శిరీష, వెనుకబడిన తరగతుల ప్రభుత్వ బాలికల వసతి గృహం వార్డెన్ సాహిన తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!