
ప్రభుత్వ కార్యాలయానికి అడ్డంగా ఇంటి నిర్మాణ పనులు
హొలగుంద (న్యూస్ వెలుగు) మండల పరిధిలోనే రనికి గ్రామంలో గ్రామ సచివాలయం రైతు భరోసా కార్యాలయం ముందు ఇంటి నిర్మాణం చేపట్టడంతో స్థానిక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బోయ మల్లికార్జున సదాశివ మల్లయ్య మట్ట మహేష్ మంగళవారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయం ముందు ఇంటి నిర్మాణములకు అధికారులు ఏ విధంగా అనుమతినిస్తారని ప్రభుత్వ కార్యాలయాలనికి రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ప్రభుత్వ స్థలాల్లో పట్టాలను చేయించుకొని నిర్మాణాలు చేపడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు ఈ విషయంలో స్థానిక తాసిల్దార్ నిజాముద్దీన్ తో వివరణ కోరగా కలెక్టర్ సబ్ కలెక్టర్ ఆదేశాలను మేరకు వారికి గ్రామంలో ఇంటి పట్టాను మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం గ్రామస్తులు గ్రామంలో మురుగు కాలువలను పరిసరాలను గ్రామపంచాయతీ కార్యదర్శి షఫీ పట్టించుకోకపోవడంతో దుర్వాసన వస్తున్నాయని రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

